Pages

Sunday, 2 March 2014

SRINU - KRIYA - KONARK(2002) - 1



                                                                          
      " సప్తాశ్వరధ మారూఢం ; ప్రచండం కశ్వపాత్మజమ్ ;
   శ్వేత పద్మధరం దేవం ; తం సూర్యం ప్రణమామ్యహమ్ "

     " గతము గతంబె ఎన్నటికి కన్నుల గట్టదు " అన్నట్లు ఏ చరిత్రకారుడు పూర్వపు చరిత్రాంశాల నన్నిటిని స్వయముగా చూసి వ్రాయలేడు . లభించిన  చరిత్రాంశాల  నన్నిటిని సంధాన పరచి దానికి ఒక రూపము ఇచ్చి చరిత్ర నిర్మించుకోవలసి యుంటుంది . ఇదియే మా చిన్న పరిశీలన యొక్క ధ్యేయము .
     
     చరిత్ర గురించి ; మరియు పురాణములు ( మతములు ) గురించి పూర్తి అవగాహన యుంటే  గాని ; మానవ పరిణామక్రమము పూర్తిగా తెలియదు . ఆధునిక శాస్త్రవేత్తలు కూడ Mythology is the DNA of the Evolution అని తెలిపినారు . మతము ; సంస్కృతులు , రెండు కలసి మానవ జీవన విధానములైనవి . ఈ సంవత్సరములోనే భారతదేశ అత్యున్నత న్యాయస్థానము ( సుప్రీంకోర్టు ) కూడ పాఠశాలలో విద్యార్ధులకు మతము గూర్చి భోదించమని శాసించినది . 
     
     " ప్రజారోగ్యమే తమ ఆరోగ్యం " అని పూర్వం రాజులు విశ్వసించినారు . చారిత్రిక ; సాంస్కృతిక  విషయములతో బాటు వైద్య విషయాల్ని ; ఆరోగ్య రక్షణ విధానాల్ని ; సుప్రసిద్ద  ఔషధయోగాల్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధముగా ; ఆయా ప్రాంతీయ భాషలలో శిల్పముల రూపముగాను , లిపి రూపముగాను రాతి స్థంభములపై చెక్కి గుడులయందు ; జనసమర్ధము గల ప్రదేశముల యందు నిక్షిప్త పరిచినారు .
     
     సిద్ధ నాగార్జనుడు నిర్మించిన సిద్ధ నాగార్జన వర్తి అనేడి ఆయుర్వేద మందు నేత్ర వ్యాధులకు వాడుదురు . ప్రతి వ్యక్తి ఈ యోగం తయారు చేసుకుని కంటి వ్యాధులు నివారించుకోవటానికి రాతి స్థంభముపై ఈ యోగమును చెక్కించినారు . ఇది ఇప్పటికి పాటలి ( పాట్నా) పుత్రము నందు యున్నది .

No comments:

Post a Comment