Pages

Monday, 3 March 2014

SRINU - KRIYA - KONARK(2002) - 6

      చెక్క విగ్రహములను ప్రతి  12  సంవత్సరములకు మార్చి ; కొత్తవాటిని ప్రతిష్థింప చేయవలయును . కాని పూరిలో ప్రతి  19 సంవత్సరములకు ఒకసారి నవకళేవర ఉత్సవము పేరున ; క్రొత్త విగ్రహములను ప్రతిష్ఠించెదరు . ఈ ఉత్సవము మొత్తమునకు  45 రోజులు పట్టును . జగన్నాధుని పాత విగ్రహము నాభి నుంచి (SOLAR FLEX) బ్రహ్మ పదార్ధమునందు  ప్రాచీన విగ్రహ సంబంధిత పదార్ధము ; బుద్దిని యొక్క పన్నుగలదని పండితులు తెలిపెదరు . 
     
     విగ్రహములు చెక్కుడుకు పది లక్షణములు కల్గిన వేప చెట్టును ఎన్నుకుందురు .1) చెట్టుకు చుట్టు ప్రక్కల పొదలుండవలయును . 2) ఈ చెట్టు కాలువ ప్రక్కన యుండవలయును .  3) చెట్టుకు దగ్గరలో ఏదైన ఆశ్రమముండవలయును . 4) దగ్గరలో స్మశానముండవలయును . 5) చెట్టుపై శంఖ ; చక్ర ; గధ ; పద్మ ; పోలిన చిహ్నములుండవలయును .  6) చెట్టుకు 12 అడుగులు వరకు కొమ్మలుండగూడదు . తరువాత కొమ్మలు మూడు మాత్రమే యుండవలయును . 7) చెట్టు మొదల చీమల పుట్ట యుండవలయును 8) చెట్టుపై పిట్టల గూడులు యుండగూడదు . 9) చెట్టు మొదట త్రాచుపాము యుండవలయును . 10) చెట్టు పై తీగలు గాని ; బదనికలు గాని యుండగూడదు . ఇందులో ఇదు లక్షణములకు తక్కువ గాని చెట్టును ఎన్నుకుందురు .
     
     దైవలక్షణములైన ప్రశాంతత ; నీరము ; ఆరాధన స్థలము ; స్మశానము (శివస్థానము) ; విష్ణుమూర్తి సంకేతములైన శంకు , చక్ర , గద , పద్మ చిహ్నములు ; త్రిశూలము ; వాల్మీకము ; ఈ చెట్టు పై ఏ ప్రాణి ఆశ్రయించి యుండగూడదు ; త్రాచుపాము (కుండలిని) . ఈ లక్షణములు కల్గిన వేప చెట్టు యందు జగన్నాధుని సృష్ఠించుచున్నారు .
     
     యోగ విద్యకు కాలనిర్ణయము లేదు . పురాథన వస్తు పరిశోధన కేంద్రము వారు ; ప్రస్తుతము పాకిస్థాన్ లోని ; ఇండస్ లోయలో హరప్పా ; మొహంజదార్ తవ్వకాలలో ; 5 వేల సంవత్సరముల క్రితమే భారతదేశములో యోగసాధన యున్నదని నిరూపించేడి ; వివిధ ఆసనములలో యున్న శివపార్వతులను పోలిన విగ్రహములు లభించినవి . ఇవి వేదకాలము ముందు నుంచి యున్నవి . ఆర్య సంస్కృతి ముందు నుంచి భారత దేశములో యోగవిద్య యున్నదని నిరూపణ అయినది .
     
     సూర్య నమస్కారములనే సూర్యోపాసనగా యోగవిద్య పేర్కొనుచున్నది . ఇది యోగ విద్య యందు ఒక అద్భుతమైన సాధన . ఈ సాధన అతి తక్కువ కాలములోనే శరీరమును మనస్సును సమతుల్యము చేయును . పురాతనకాలము నుంచి ఎన్నో దేశములలో సూర్యోపాసన జరుగుచున్నది . పెర్షియన్స్ మిత్రాస్ గాను ; ఈ జిష్షియన్స్  ఒరిసిస్ గాను ; చాల్ డెన్స్ బాల్ గాను ; గ్రీక్సు అపోలోగాను పూజించుచున్నారు .
     
     ప్రపంచ వ్యాప్తముగా సూర్యునికి గుడులు కట్టి పూజించినారు . ఈజిప్ట్ లోని పిరిమిడ్స్ ; మెక్సికోలోని యుకాటన్ ; బాబిలోనియాలోని జికృత్స్ మొదలగునవి . హిందువులు సూర్యుని త్రిమూర్తిగా పూజించెదరు . ఉదయించే సూర్యుడు బ్రహ్మ (సృష్టి) ; మధ్యాహ్న సూర్యుని  విష్ణు (స్ఠితి) ; సాయంకాల సూర్యుని శివునిగా (లయ) భావించెదరు . ప్రపంచ వ్యాప్తముగా యున్న పురాతన సంస్కృతి  ప్రకారము సూర్యుడు డిసెంబరు 22 మరణించి  మరల డిసెంబరు 25 కు పుట్టునని తలంచెదరు . ఈ మధ్యకాలములో భూమిపై అతి తక్కువ కిరణములు ప్రసారమగును .
     
     సూర్య నమస్కారములు మిగిలిన అన్ని ఎక్సర సైజుల కన్న ; మనస్సు ; శరీరముల పై ఎక్కువ ప్రభావము చూపును . ఇవి శరీరమును సాగదీసి ; కుచింపచేసి ; శరీరస్థితి స్ఠాపకతను సరిచేయును . శరీరములోని ప్రసరణ వ్యవస్థలను ; విసర్జనవ్యవస్థను ; ఉచ్వాశనిశ్వాసములను ; నరముల వ్యవస్థను ; సూక్ష్మమైన ప్రాణవ్యవస్థను మెరుగుపరుచును . 
     
     సూర్య నమస్కారములలోని  12  ఆసనములు ; ఆకాశములోని  12 రాశులకు సంకేతములు . మేషము ; వృషభము ; మిధునము ; కర్కాటకము ; సింహము ; కన్య ; తుల ; వృశ్చికము ; ధనస్సు ; మకరము ; కుంభము ; మీనము ; సాంబుడు (12 రాశులు) సూర్య నమస్కారములును ;  12  సంవత్సరములు సాధన చేసి ; పరిపూర్ణ ఆరోగ్యము పొందినట్లు తలంచవచ్చును .
     
     నవగ్రహములలో  2 చాయాగ్రహములు ; మిగిలినవి  7 . ఈ ఏడు శరీరమందలి  7  చక్రములు . ఒక నీటి బిందువు ద్వారా ఒక తెల్లటి కిరణమును ప్రసరింపచేసిన  7 రంగులు (VIBGYOR) వచ్చును . ఈ  7 రంగులు శరీరము పై ప్రసరించి ; రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుచును .  " సప్తాశ్వరధమారూఢం "  శ్లోకము యొక్క అర్ధము ఇదే అయియున్నది .
     
     కాలువ యందు స్నానము చేసి ; ఉదయించే సూర్యునికి ఆర్ఘ్యము వదిలినప్పుడు ; నీటి బిందువు పై పడిన సూర్య కిరణము  VIBGYOR  గా ; సాధకుని శరీరముపై పడి మేలు చేయును . ఉప్పునీటి యందు స్నానము చేసిన (సముద్రము) చర్మవ్యాధులు తగ్గును . కావున సాంబుడు సముద్రమునందు స్నానము చేసి ; సూర్యునికి ఆర్ఘ్యము వదిలి ; సూర్య నమస్కారములు సాధన చేసి ; తన ఆరోగ్యమును సరిచేసుకున్నట్లు తలంచవచ్చును . 
     
     నిత్య జీవితములో ఉద్రేకములతోను ; మానసిక సంఘర్షణలతోను భాధపడుచున్న వ్యక్తులు ; ఐదు నిమిషములు సూర్య నమస్కారములు సాధన చేసిన ఎడల వెంటనే నివారణ పొందగలరు .ప్రకృతి వైద్యమందు సూర్య చికిత్సకు ప్రత్యేకమైన విశిష్ఠత కలదు .
     
     పతంజలి మహర్షి ; సాధకుడు పరిపూర్ణ చైతన్యము పొందవలయునన్న  1) జన్మ వలన వచ్చెడి సిద్దులు  2) ఓషధులవలన వచ్చెడి సిద్దులు  3) మంత్రముల వలన కలిగెడి సిద్దులు  4)  తపస్సు వలన కలిగెడి సిద్దులు 5) సమాధి సిద్దులు  కావల్యునని యోగ సూత్రములలోని కైవల్య పాదము నందలి మొదటి శ్లోకములో తెలిపినారు . కావిన సాంబుడు ఈ  5 మార్గములను అనుసరించినట్లు అర్ధమగుచున్నది .
     
     ఈ జీవితమనెడి యుద్ధభూమి యందు జీవించవలయునన్న యోగివికమ్మని కృష్ణుడు భగవత్ గీతలో నొక్కి చెప్పినారు . తండ్రి వాక్ ను సాంబుడు పరిపూర్ణముగా సాధించినాడు .
     మన శరీర మందలి నాభిస్థానమును SOLAR FLEX  అని అందురు . అనగా మన శరీరములోని కోణార్క్ అని అర్ధము . ఇచ్చట పంచాగ్నులు యుండును . ఇవి మనము తీసుకునేడి ఆహారము నందలి క్రిములులను చంపి ; ఆహారము అరిగించి ; శరీరములోని అన్ని అవయవములకు సరఫరా చేయును . అందువలన  SOLAR FLEX   ఒక యజ్ఞ పాత్ర గా  తలంచువచ్చును . కోణార్క్ గుడి యొక్క  GANDI  భాగము బోర్లించిన యజ్ఞ పాత్ర వలె యుండును . (PYRAMID)  సుమేరువలే యుండును .

No comments:

Post a Comment