Pages

Monday, 3 March 2014

SRINU - KRIYA - KONARK(2002) - 4

     విష్ణు మూర్తికి ఒక చేతిలో శంఖము , (నాదము , THEATAWAVE CONTROLE) రెండవ చేతిలో చక్రము ( జ్యోతి , PITUTARY OR PENAL CONTROLE) మూడవ చేతిలో గధ (జ్ఞానము KNOWLEDGE IS POWER ) నాల్గవ చేతిలో పద్మముతో గూడిన అభయాస్తము . అభయాస్తము - SERVICE TO HUMANITY . పద్మము - KUNDALINI ; గరుడ పక్షి - ELEVATED THINKING ఈ ఆరు అంశములు సాధన ద్వారా ఏర్పరుచుకున్న ఏ వ్యక్తి అయిన విష్ణుమూర్తి అవుతాడు .
     
     పూరిని శక్తి కేంద్రముగా చేసి తాంత్రికులు  1) శంఖుస్థాన్ జగత్ నాద్ (పూరి) ఆలయము ; జగత్ ను నడిపించే నాదమునకు సంకేతము . ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలైన ; సోక్రటీసు ; పైధాఘరస్ ; కబీర్ ; షిరిడీ బాబా అందరూ నాద యోగ సాధకులే . BIO - FEED BACK APPARATUS తో సాధకుడు నాదము చేసిన యెడల G.S.R ; PULSE ; RESPIRATION ; BODY TEMPARATURE ; NORMAL కు వచ్చును . మెదడులో THEATA ( CREATIVITY) అలలు పెరుగును . ఆచార్య రజినీష్ గారు తెలిపినట్లు , 500 సంవత్సరముల తర్వాత ఎవరయినా మందు మాత్రలు లేకుండా నిద్ర పోతున్నారంటే ఒక వింత విషయమే . ప్రస్తుతము ఈ పరిస్థితి అందరు యందు అంటే విద్యార్ధులు , చంటి పిల్లల యందు కూడా యున్నది . నివారణ మార్గము నాదమే ! ( ఓంకారము ) 2) చక్రస్థాన్ : లింగేశ్వర మందిర్ (భువనేశ్వర్) ఇచ్చట యజ్ఞ యాగాదులకు (అగ్ని) ఎక్కువ ప్రాముఖ్యత యున్నది . 3) గధాస్థాన్ : జాజ్ పూర్ లోని  సాక్షి గోపాల్ దేవాలయము ఇది జ్ఞానమునకు కేంద్రము . 4) పద్మస్థాన్ : కోణార్క్ లోని సూర్యదేవాలయము ; ఇది కుండలిని సాధన కేంద్రము , మనలోని చైతన్యాన్ని పెంపొందించుకొనుటయే కుండలిని . ఈ విధముగా నాలుగు కేంద్రములు సాధకుని సాధనా సౌలభ్యము కొరకు ఏర్పడినవి . భగవత్ గీతకు చాలా మంది వ్యాఖ్యానాలు వ్రాసినారు . అందరు వారి అవగాహనలకు దగ్గరిగా  వ్రాసినారు . వీరిలో యోగిరాజు శ్యామాచరణ లాహిరి గారు వ్రాసిన వ్యాఖ్యానము తాంత్రికముగా ; ప్రతి వ్యక్తి గీతను తన అంతఃకరణములో చూచెడి విధముగా వివరించినారు . మానవ శరీరమే కురుక్షేత్రములోని యుద్ధ భూమి , ఈ భూమిలో ప్రతి క్షణము ప్రవృత్తికి ; నివృత్తికి యుద్దము జరుగుచునే యుంటుంది . మన మనస్సే దృతరాష్టుడు ; మనశరీరాన్ని పాలించువాడు ; గుడ్డివాడు ; తనని తను కంట్రోలు చేసుకొనలేనటు వంటివాడు .  మనస్సు యొక్క 100 ప్రవృత్తిలే కౌరవులు , శరీరమందలి పంచ భూతాలే పాండవులు వీరు ఐదు చక్రములలో యుందురు . 1) మూలధారము (భూమి)  2) స్వాదిష్ఠానము (నీరు)  3) మణిపూరకము (అగ్ని)  4) అనాహత (వాయువు) 5) విశుద్ధి (ఆకాశము) ఈ ఐదు చక్రములు తమ యొక్క జ్ఞానేంద్రియములు ; కర్మేంద్రియముల ద్వారా మానసిక ప్రవృత్తులను అదుపులో యుంచును .
     
     కృష్ణుడు  యొక్క స్థానము కూటస్థము (ఆజ్ఞ) ఈయన కేవల కుంభకము అనెడి క్రియ ద్వారా ప్రవృత్తులను : నివృత్తులను సమతుల్యము చేయును . అతి తక్కువ ఉచ్వాసనిశ్వాసలనే కేవల కుంభకము అందురు . అప్పుడు BODY  యొక్క  BIOLOGICAL RYTHAM  తగ్గి  BRAIN  లో  THEATA WAVES పెరుగును . మనస్సు ; శరీరము ఆనందము అనుభవించును .
     
     మెదడులోని వెనుక పక్క భాగములు యొక్క పోలిక పూరిజగన్నాధుని పోలియుండును . దీనినే బొటనవ్రేలు పరిమాణములో యున్న పురుషోత్తముడుగా భావించి సాధకులు సాధన చేయుదురు .
     
     నిత్యజీవితములో మనము ఎన్నో VEHICLE ACCIDENTS చూస్తాము . ప్రతివాడు BREAK వేశానని భావిస్తాడు . కాని  BREAK పడదు . మన  FIVE SENSES (పాండవులు)  రాబోయే అపాయాన్ని : PITUTARY & HYPOTHALA MUS SYSTEM కి (కృష్ణుడు) సమాచారాన్ని పంపుతాయి . వెంటనే దీన్ని: CAR (కృష్ణుడు) BREAK వెయ్యమని MOTOR NERVES (కౌరవులు) కు ELECTRO CHEMICAL ACTION ద్వారా సంకేతాలు పంపిస్తాయి . MOTOR NERVOUS అలసత్వ (EGO) ములో వెంటనే BREAK వేయక పోవుటయే (కురుక్షేత్ర సంగ్రామము) ACCIDENT .
     
     ఓ జీవుడా ! ఓం కారమును స్మరించుము - యజుః 40-15 . వేణుగోపాలుని చాలామంది భక్తులు ఆరాదించెదరు . గోప అనగా చైతన్యము . కృష్ణ కూడా చైతన్య (AWARENESS) సంకేతమే . వేణువు మన శరీరమందలి వెన్నుపూస , వేణువునకు యున్న ఏడు రంధ్రములు మన వెన్నుపూస యందు యున్న ఏడు చక్రములు . ఏడుచక్రములు సమతుల్యతగా యున్నప్పుడు ఓం కారనాదము వినపడును . కొంత కాలము సాధన చేసిన నాదము తప్పక లభించును . నాదము వినగల్గినప్పుడు మీరు వేణుగోపాలుడే ! సృష్ఠి లోని ప్రతి అణువు SOUND VIBRATIONS (నాదము) తో నిండియున్నది . అందువలనే మహర్షులు దీనిని జగత్ నాదము(జగన్నాధ్) గా తెల్పినారు . పతంజలి మహర్షి కూడ (యోగ సూత్ర  1: 27) ఓంకార నాధమే భగవంతుని స్థితిగా తేల్చినారు . అంతులేని ఆనందమే భగవంతుని అనుభూతి .
    
      ఓంకారములోని " ఓ "  LOW B.P. వారికి . " మ్ "  HIGH B.P. వారికి ఆరోగ్యము మెరుగు పరుచును , కొంతకాలము సాధన చేయవలయును . గాయత్రి మంత్రమును గానము చేయువారిని రక్షించునదిగా మహర్షులు తెలిపినారు . మాకుసత్ బుద్ధినిచ్చి సత్కర్మలు ఆచరించుటకు కావలసిన శక్తిని ప్రసాదించమని ప్రార్ధించుటయే గాయత్రి మంత్రము . ఇందులో 24 బీజాక్షరములు యుండును . ఈ బీజములు (SOUND VIBRATIONS)  సాధకుని POSITIVE THINKER & DYNAMIC PERSON  గా తీర్చిదిద్దును . ప్రపంచ ప్రఖ్యాతి నొందిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయమును స్థాపించిన వారు పండిత మదన మోహనమాలవ్య గారు గాయత్రి మంత్రము లోని 24 బీజములను ,  63 - 1/2  గా విభజించి , వీటితో శరీరములోని  64 స్థానములలో చలనము కల్గించెడివారు , ఈ విధముగా ఒక గాయత్రి మంత్రము సాధన చేయుటకు ఒక గంట పైన కాలము పట్టును . తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారు గాయత్రి మంత్రమునకు ద్రష్ఠ మహర్షులు తెలిపిన తాంత్రిక విద్య , అనుభవ పూర్వకమైనది , సాధకుని పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దును , అమితమైన ఆనందమును అందచేయును . 
     
     శ్రీ చక్రమునందు  9 చక్రములు యుండును . మనశరీరమునందలి 9 చక్రములు ;  1) మూలాధార  2)  స్వాధిష్ఠాన  3) మణిపూర  4) అనాహత  5) విశుద్ది  6) ఆజ్ఞ  7) లలానన 8) బిందు  9) సహస్రారము . సమతుల్యముగా పనిచేసిన ఎడల , మన శరీరమే  శ్రీ  చక్రము . తాంత్రిక విద్య అంతయు అంతర్గత సాధనే అయియున్నది , ఇది అంతయు మానవ పరిణామమునకు సహాయపడును .
    
      INTRAVERTS ; BRONCHAL & ASTHMA , కీళ్ళనెప్పులతో భాదపడుదురు , EXTRAVERTS ; B.P , DIABETIC , PARALYSIS  తో భాదపడుదురు . నాడీశోధన ప్రాణాయామ సాధన ద్వారా వీటి నుంచి తప్పించు కొనవచ్చును .
     
     ఈ ప్రపంచము నందలి మానవాళి పురోభివృద్ది అంతయు ఆర్ధికవ్యవస్థపై ఆధారపడి యున్నది . ఆర్ధిక వ్యవస్థనే హిందువులు లక్ష్మిదేవిగా  పూజించెదరు . లక్ష్మిదేవి అనగా మనలోని చంద్రనాడి . చంద్రనాడే మానసిక శక్తిని ఇచ్చును . మానసిక పరిపూర్ణతతో యున్న వ్యక్తి ఏ వృత్తి చేసిన ఆర్ధిక బలము చేకురును .
     
     లక్ష్మిదేవి సంకేతములు యొక్క 8 ధ్యేయములే అష్ఠ లక్ష్ములు .

     1) ధనలక్ష్మి స్తోత్రమందు , దుందిభినాధము , శంఖనినాదము , మానసిక ఎకాగ్రత సంకేతములు (THEATA WAVE) 

     2) విద్యా లక్ష్మి : సరస్వతి , మేదస్సు , యుండవలయును (KNOWLEDGE IS POWER)

     3) విజయలక్ష్మి : కమలము పద్మాసన సంకేతము . పద్మాసనము సుషుమ్న నాడిని (CREATIVITY) ని పెంపొందించును , నాకు శుభములు కల్గవలెననెడి సంకల్పము (WILL POWER) సంకేతమే శివుడు . CREATIVITY & WILL POWER యున్న వ్యక్తికి ప్రతి పని యందు విజయము సిద్ధించును .

     4) సంతానలక్ష్మి : ప్రతిప్రాణి , తన శరీరము చనిపోయిన తరువాత గూడ , తన సంతాన రూపముతో బ్రతకవలెననెడి బలీయమైన జీవితేక్ష యే సంతానలక్ష్మి .

     5) గజలక్ష్మి : భూమి పై యున్న అతి శక్తివంతమైన ప్రాణి ఏనుగు . సంఘములో అన్ని విధమైన హంగులు కల్గి యుండుటయే గజలక్ష్మి . 

     6) ధైర్యలక్ష్మి : పిరికివాడు జీవితములో ఏదీ సాధించలేడు . మంత్రము , జ్ఞానములతో , మానసిక పిరికితనాన్ని పోగొట్టుకొనుట తనని తను తెలుసుకొనుటయే ధైర్యలక్ష్మి . 

     7) ధాన్యలక్ష్మి : ఆహారము లేనిదే ఈ ప్రపంచములో ఎవ్వరు జీవించలేరు . ఆహారము కల్గియుండు లక్షణమే ధాన్యలక్ష్మి . 

     8) ఆదిలక్ష్మి : పాలు ఇచ్చు జీవములు మాత్రమే శరీర ఉష్ణోగ్రతను పెంచు కొనగలవు . వృక్ష ప్రపంచమునకు సంబంధించిన పద్మము రోజుకు  1  వాట్ వేడిని తయారుచేయును . లక్ష్మి సముద్రుని  కుమార్తె , చంద్రుని చెల్లెలు , కావున ఈవిడకు చంద్రుని లక్షణములు (చంద్రనాడి) యుండును . పద్మము వలె స్వయంకృషితో చంద్రనాడి పరివేక్షణలో పైన తెలిపిన ఏడు లక్షణములు కల్గియుండుటయే ఆదిలక్ష్మి . ఈ ఎనిమిది అంశలు కల ఏ వ్యక్తికైన అష్ఠలక్ష్మి వైభవము లభించును .

No comments:

Post a Comment