Pages

Monday, 3 March 2014

SRINU - KRIYA - KONARK(2202) - 2

 ఆర్క అనగా సూర్యుడు , కోణ అనగా త్రికోణము , త్రికోణముతో గూడిన స్థలము నందు యున్న సూర్యదేవాలయమునకు కోణార్క్ అని పేరు వచ్చింది . అక్కడ యున్న దేవతా స్వరూపాన్ని బట్టి ఆ పేరు  వచ్చినది . 
     
     ఈ స్థలము LAT 19"51'N ; LONG 86"01'E ; కుశబద్రనది ఒడ్డున , గుడికి నైఋతి దిక్కున 9 K.M వరకు ; త్రికోణ రూపముతో యున్నది . తూర్పున బంగాళఖాత సముద్రమున్నది . కోణార్క్ దేవాలయము ముందు యుండు మండపము నిర్మాణము ; సూర్యుని కిరణములు ; రెండు కోణముల నుంచి గర్బగుడిలోని విగ్రహము వరకు ప్రసరించునట్లు వాస్తు శిల్పులు ఏర్పరిచినారు . గుడి నిర్మాణము ఒక అంగుళములో వందోవంతు Accuracy గా ( 1/100" ) యున్నది . కాలక్రమేణా భూకంపముల వలన , పిడుగులు వలన గుడి శిధిలము చెందినప్పుడు తరువాత చరిత్ర కందని చాలా మంది  గుడిని పునర్ నిర్మాణము చేసినారు . అందువలన ఈ గుడిపై బౌద్ధుల ; జైన మొదలగు చాలా సంస్కృతి ప్రభావములు యున్నవి . చారిత్రిక ఆధారముగ గంగా రాజవంశీకులు పునర్ నిర్మించినారు .
     
     భవిష్య పురాణము ; సాంబ పురాణముల ప్రకారము ; శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబునికి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ; శ్రీ కృష్ణుడు సాంబునికి యోగ విద్యతో పాటు చంద్రభాగ నది ఒడ్డున యున్న మిత్రవనములో ; సర్వ చర్మవ్యాధులను తగ్గించెడి సూర్యుని కొరకు ; అతని అనుగ్రహము సంపాదించుట కొరకై ప్రార్ధించమని తెలిపెను . అచ్చట సాంబుడు 12  సంవత్సరములు తపస్సు చేసిన తరువాత ; కుష్ఠు వ్యాధి పూర్తిగా నివారింపబడెను . 
   
     సాంబుడు సూర్యునికి కృతజ్ఞతగా అచ్చట ఒక సూర్య దేవాలయము నిర్మాణమునకు సంకల్పించెను . సాంబునికి ఒక రోజు చంద్ర భాగనదిలో స్నానము చేయుచున్నప్పుడు ; నదిలో ఒక సూర్య విగ్రహము లభించెను . మిత్ర వనములో ఆ విగ్రహమును ప్రతిష్ఠించి దేవాలయము నిర్మించెను . చంద్రభాగనది సముద్రములో కలిసేడి చోటన ఈ దేవాలయము నిర్మించెను . ఈ దేవాలయమునకు ఎదురుగా ( తూర్పున ) సముద్రముండును . కాలక్రమేణా ఈ గుడి ముందు 3  కిలో మీటర్లు వరకు ఇసుక మేట వేసెను  అందువలన సముద్రము ఇప్పుడు గుడికి 3 కిలో మీటర్ల దూరములో యున్నది .
     
     యూరోపియన్ నావికులు 1680 యందు ఈ దేవాలయాన్ని BLACK PAGODA  గా పిల్చెడివారు . ప్రపంచవ్యాప్తముగా సూర్యుడు అన్ని విధములైన జబ్బులను తగ్గించును అనెడి భావముతో సూర్యదేవాలయము నిర్మింపబడినది . వేదాలలో సూర్యుని ఈ విధముగా తెల్పుచున్నారు .  
  సూర్యుడు విషనాశకుడు - ఋగ్ 1 -191 - 10
 సూర్యుడు సామాన్యదృష్ఠికి అందని సూక్ష్మ క్రిములను ;  సర్వపీడాకర  యాతుధానములను సంహరించును , ఋగ్ 1- 191 - 8
 ఆవాలు ; సూర్యకిరణములు తీక్షోష్ణ గుణము కలవి ; సర్వ చర్మవ్యాధులు , కుష్టు వ్యాధులు వీటి వలన తగ్గి , శరీరము ఆరోగ్యము పొందును - అధర్వః 24 - 1 .                                                                        
     
     ఆర్కని ఆయుర్వేదము నందు జిల్లేడు చెట్టుగా పిలిచెదరు . జిల్లేడు శ్వాసకోశ వ్యాధుల యందు ; చర్మ వ్యాధుల యందు అమోఘముగా పనిచేయును ; BRONCHAL ASTHMA & BRON CHITIS . 
జిల్లేడు మూలిక కృశించిన శరీరాన్ని తిరిగి వృద్ధి చెందించి పూర్వ స్థితికి తెచ్చును. అధర్వః   6 -72 - 1
    
     కోణార్క్ ను  కోటి సూర్య్లులుగాను  లేక అనంతమైన సూర్యులు గాను భావించెదము . ఆయుర్వేదము నందు ఎన్నిపుటములు పెట్టిన ఆ మందు అంతశక్తి వంతమగును. కోణార్క్ ను కోటి పుటములు లేక అనంతపుటములు పెట్టిన జిల్లేడుగా భావించవచ్చును . ఎక్కువ పుటములు పెట్టిన జిల్లేడు కుష్ఠురోగమునకు ఎంతో ఉపయోగకారి . నాదయోగులు ఎక్కువ మంది ఆయుర్వేద నిష్ణాతులు ; త్యాగరాజు గూడ నాదయోగియే ; వారి కీర్తన యందు నిగూఢముగా ఆర్కను వివరించినారు .
                                                     ఆర్కమనుచు జెల్లేడు తరుపేరు
                                                     మర్కట బుద్ధులెట్లు లేరు
                                                     ఆర్కుడనుచు భాస్కరుని పేరు
                                                     తర్కమనే అంధకారము తీఱు !!

 ఈ వ్యాసము నందు తంత్రము గూర్చి కొంత అవగాహన అవసరము కోణార్క్ దేవాలయము పూర్తిగా తాంత్రికముగా నిర్మింపబడినది . తంత్రము అనగా సాధనశాస్త్రము . ఇందులో ఎట్టి విధమైన అభూత కల్పనలు యుండవు . ఒక  నిర్ధుష్ఠమైన ధ్యేయము కొరకు సాధన చేసి ఫలితము పొంది స్వయం అనుభవముతో దానిపై నమ్మకమును పెంచుకొనుట యే తంత్రము (PRACTICLE SCIENCE) .

     ఊదా : మానసిక ఏకాగ్రత లేనివారు కొంతకాలము శాంభవి ముద్ర సాధన చేసిన యెడలఏకాగ్రత లభ్యమగును . ఇదియే తాంత్రికము . 
     
     మానవునిలో యున్న సృజనాత్మకతశక్తియే కుండలిని , ఈ శక్తిని పెంపోందించుకొనుటకు సాధకులు మంత్రము ; యంత్రము ; తంత్రము ; అవలంభించేదరు . 

     ఉదా : మానసిక ఏకాగ్రత పెంచుట కొరకు .

     మంత్రము : 24 ఓంకారములు ; ప్రతి ఓంకారము 20 సెకనులు తగ్గకుండ సాధన చేసిన యెడల మెదడులో ఏకాగ్రత ( తీటా అల ) పెరుగుతుంది .

     యంత్రము : కొంతకాలము రోజుకు 40  నిమిషములు తగ్గకుండ ఒక నిర్ధుష్ఠమైన , బిండువుపైన గాని , రూపముపై గాని , జ్యోతిపై గాని , శాంభవి ముద్ర చేసిన యెడల మెదడులో తీటా అలలు పెరుగును . 

     తంత్రము : ఒక నిర్ధుష్ఠమైన ధ్యేయముతో , అనుభవము కల్గిన వారి సమక్షములో మంత్ర , యంత్రముల సాధన చేసి స్వయముగా ఫలితము పొందుటయే తంత్రముగా మహర్షులు తెలుపుచున్నారు .



No comments:

Post a Comment