యోగ విద్య ప్రకారము ఈ సృష్ఠి పంచ భూతములతోను , పంచతన్మాత్రలతోను నిండి యున్నది . ప్రతి అణువులోను ఇవి యున్నవి . పూజ విధానములో అందరూ తెలిసో తెలియకో ఈ పంచతన్మాత్రలను పూజించుచున్నారు . ఇదియే తంత్రము .
పూజలో అగరువత్తులు , సాంబ్రాణి వాడుట వాసన తన్మాత్ర ( భూమి )
రుచికరమైన పదార్ధముల నైవేద్యము రుచి తన్మాత్ర ( నీరు )
దీపారాధన దృష్ఠి తన్మాత్ర ( అగ్ని )
గంధము బొట్టు పెట్టి అలంకరించుట స్పర్శ తన్మాత్ర ( వాయువు )
మంత్రములు ; గంటలు ; శబ్ధ తన్మాత్ర ( ఆకాశము )
మనము సాధారణ పూజ చేసిన గూడ మన మెదడులోని వాసన ; రుచి ; దృష్టి ; స్పర్శ ; శబ్ద కేంద్రములలో ఎరుక పెరుగును . ఈ విధముగా వివరణలు తెలుసుకొని సాధన చేసి ఫలితము పొందుటయే తంత్రము . ప్రపంచములోని అన్ని సంస్కృతులు వీటిని ఎదో ఒక రూపముగా అనుసరించుచున్నారు . ఈ సాధనల కొరకు గుడులు గాని కేంద్రములు ఏర్పరచుకున్నారు . సాధకులు ఈ కేంద్రములను చాలా శక్తి వంతముగా పవిత్రముగా భావించుచున్నారు . బ్రిటన్లోని స్టోన్ హెగే ; పిరమిడ్స్ ; సెంట్రల్ అమెరికాలోని మయాన్ పిరమిడ్స్ అన్నియు సాధన ( తాంత్రిక ) కేంద్రములే తంత్ర విద్య మనిషి సంపూర్ణముగా ఎలా బ్రతకవలెనో తెలుపును . ప్రసిద్ధ వైద్యులు PROF. K.N.UDUPA గారు పూజా విధానమును; శక్తివంతమైన మానసిక చికిత్సతో పోల్చినారు . వరాహతంత్ర మానవాళి పురోభివృద్దికి కావలసిన అంశములను ఈ విధముగా వివరించు చున్నది . 1) చైతన్యము 2) సృష్ఠిప్రళయము 3) దైవపూజలు 4) గ్రహములు , నక్షత్రములను గూర్చి 5) మానవ శరీరములోని నాడి వ్యవస్థ , మరియు చక్రములు 6) సాంఘిక ధర్మములు ; ఆచరణ 7) పుణ్యకార్యక్రమములు 8) మంత్ర ; యంత్రములు 9) ముద్రలు 10) బాహ్య అంతర్గత పూజలు 12) గృహములు , బావులు 13) పవిత్ర స్ఠలములు , గుడులు 14) దీక్షలు 15) యోగ 16) యోగ సాధనతో గూడిన ఆయుర్వేద వైద్యము 17) విజ్ఞానము మొ!! మహర్షులు తంత్ర విద్యయందు మానవాళికి కావలసిన సమగ్ర సమాచారమును వారికి కాలానుగుణముగా అందుబాటులో యున్న వానిని పొందు పరిచినారు . ప్రతి గుడి యందు ఈ సమాచారము అంతయూ యుండును .
భారత దేశములో ఆచరించు తంత్రములు 5 రకములు : 1) వైష్ణవ : వీరిదేవుడు విష్ణువు వీరి గ్రంధములను వైష్ణవ ఆగమాలు (పంచారతలు) అందురు , 2) శైవ ; దైవము శివుడు ; శైవ ఆగమాలు 3) శాక్తేయులు ; దైవము శక్తి ; గ్రంధములు శక్తాగమాలు ; 4) సౌర్య ; దైవము సూర్యుడు ; గ్రంధములు సూర్యాగమాలు , 5) గణపత్య ; దైవము గణపతి ; గ్రంధములు గాణపత్యా గమాలు . భారతదేశములో కొన్ని ముఖ్యమైన తాంత్రిక కేంద్రములు కలవు ; వీటిలో ఒకటి ఒరిస్సా రాష్ట్రములోని పూరి . తాంత్రిక కేంద్రములు ఏర్పరుచుటలోని ముఖ్య ఉద్దేశ్యము ; సాధకులు అంతర్గతమై ; తన శరీరమునే తాంత్రిక కేంద్రముగా భావించి సాధన చేయుట . దేహమే దేవాలయము ; అందులోని జీవుడే దేవుడు ; అన్నధ్యేయమే ముఖ్యము .
ఏ దైవాన్ని పూజించిన కూడ ; ఆ దైవ లక్షణములను మనలో పెంపొందించు కొనవలయును ; అప్పుడు సాధకుడిలో సృజనాత్మకత పెరుగును . ఇదియే మహర్షుల యొక్క ముఖ్య ఉద్ధేశ్యము . దీనినే యోగ విద్యలో సంయమనము అందురు . అగ్ని పురాణము : రుద్రుని పూజించిన వారు రుద్రులు అగుదురు , సూర్యుని పూజించిన వారు సూర్యులు అగుదురు ; విష్ణువుని పూజించు వారు విష్ణువు అగుదురు . శక్తిని పూజించు వారు శక్తి అగుదురు . తంత్రము మానస వికాసమునకు సమగ్ర శాస్త్రము అగుట వలనే దీనిని " భక్తి ముక్తి కారణిక " అని అందురు . ప్రసిద్ధ విజ్ఞాన వేత్తలు పురాణములను మానవ పరిణామ ప్రక్రియకు పునాధి రాళ్ళుగా పేర్కొనినారు.
చైనాలో ఒక సామెత కలదు " ఒక కళాకారుడు ఒక చెట్టు బొమ్మ వేయవలెనన్న ముందు తను ఆ చెట్టు కావలయును ; (MERGING : లయ) ; అప్పుడు చెట్టు పోలికలన్నియు తనలో వచ్చి ; చెట్టు బొమ్మకు సంపూర్ణ న్యాయము చేకూర్చును " రామకృష్ణ పరమహంస గారు అమ్మవార్ని పూజించేటప్పుడు అమ్మవారి వలె , ఆంజనేయ స్వామిని పూజించునప్పుడు ; ఆంజనేయ స్వామి వలె ప్రవర్తించేడి వారు . అన్ని సంస్కృతుల యందు తాంత్రికము కలదు .
దక్ష ప్రజాపతి కుమార్తె సతి . సతి తండ్రి అబీష్ఠమునకు వ్యతిరేకముగా శివుడిని వివాహమాడింది . దక్ష ప్రజాపతి యజ్ఞము చేయుచున్నప్పుడు , శివుడి మీద యున్న వ్యతిరేకతతో అల్లుడైన శివుడిని ; కుమార్తె అయిన సతిని యజ్ఞమునకు ఆహ్వానించలేదు . సతీదేవి ఇది అవమానముగా భావించి యజ్ఞమందు దూకి మరణించినది . శివుడు వచ్చి అందరిని చంపి ; యజ్ఞమును నాశనము చేసి సతీదేవి శవమును పుచ్చుకొని చాలా భయంకరముగా ప్రవర్తించెను ; విష్ణుమూర్తి గరుడ వాహనముతో పై నుంచి ; చక్రముతో సతీదేవి శవాన్ని ముక్కలు చేసి అన్ని పైపులకు విసిరివేసి తరువాత శివుడిని శాంతింప చేసాడు . సతీదేవి శవము యొక్క ముక్కలు పడినవన్నియు తాంత్రిక (శక్తి) కేంద్రములు . నాభిస్థానము (SOLAR FLEX) - (KONARK) పూరిలో పడింది . అందువలన పూరి ఒక తాంత్రిక కేంద్రము . ఇది పురాణము .
నిత్య జీవితములో మనము ఎన్నో అనాలోచితమైన పనులు చేస్తాము . పనులు చేసేది SYMPATHETIC NERVE (ప్రజాపతి) ఆలోచన ఇచ్చేది PARASYMPATHY (సతి) ; PITUTARY (శివుడు) . ఈ మూడు కలసి చేస్తే గాని ఫలితము (యజ్ఞము ) యుండదు . రసాయానిక ; విద్యుత్ చర్యలే జీవితము . వీటితో ఆలోచించాలా అనెడి EGO తో SYMPHATHIC NERVE ఒక్కటీ ఏ పని చేసిన ; PARASYMPATHIC SUPRESS అవుతుంది . అప్పుడు (శివుడు) PITUTARY ; శరీరమునకు ; B.P ; DIABETIC ; PSYCHIC PROBLEM ,DIGESTIVE PROBLEMS ఏర్పాటు చేస్తుంది . శరీరము చాలా అస్థవ్యస్థమునకు చేరుతుంది . (ENDROCLINE IMBALANCE) . విష్ణువు (THYMUS ;WILL POWER) ; చక్రము (CONCETRATION) తో అనారోగ్యము పై కేంద్రీకరించి ; తన వైద్య శక్తితో PARASYMPATHIC NERVE ను సాధారణ స్థితికి తెచ్చి అనారోగ్యములు సరిచేయును . మెదడు యందు యున్న విపరీతమైన ఆలోచనలను చెల్లాచెదరు చేయుటయే సతీదేవి శవమును ముక్కలు ముక్కలుగా చేసి విసిరివేయుట . ఇది ప్రతి వ్యక్తియందు ప్రతి క్షణము జరిగెడి తంత్రము .

No comments:
Post a Comment