Pages

Monday, 17 March 2014

SRINU-KRIYA-SOUNDARYALAHARI-KI-PRAYOGA-SASTRAM.

 

        సౌందర్యలహరి

  ఆత్మీయులకు ,
   
         ఈ పుస్తకము 1999 లో ముద్రించుటకు ముఖ్యమైన కారణమేమనగా , హిందు సంస్కృతి గ్రంధములన్నియు , మానవ జాతి పురోభివృద్ధి కొరకై , మహర్షులు వారి సంకల్ప బలముతో రచించిన సాధనా గ్రంధములే . భక్తులు పూజించుటకు , సంగీత విద్వాంసులు పాడుకొనుటకు , సాధకులకు సాధన మార్గములు గాను , అన్ని వర్గముల వారికి తేలికగా అన్వయించుకొనునట్లు వ్రాసినారు . అందువలనే ఇన్ని వేల సంవత్సరముల నుంచి కూడా ఈ గ్రంధములు చెక్కు చెదరకుండా యున్నవి . జీవనశైలిలో కలిసిపోయినవి . రాబోయే తరముల వారికి ఈ జ్ఞాన నిధిని అందించుటయే మన అందరి భాద్యత ! లేని ఎడల మానసిక బీదతనము , వికలత పెరుగును . 
     చరిత్రకారుల రచనల ఆధారముగా ఈ శ్లోకములన్నియు కాశ్మీరునందలి , శివ (హరి) ధాసుల వంటి వారు , జానపద ప్రజలు , సామాన్యులు , పల్లె గీతములు వలె పాడు కొనెడి వారట . ఆది శంకరులు వీటిలో కొన్ని శ్లోకములను ఏరి గుచ్చి తయారు చేసిన దండయే సౌందర్యలహరి అని తెల్పుచున్నారు . ఎక్కువగా శివ వర్ణనేయుండును . మనస్సు ఆనందముగా యుండుటయే శివము లేని ఎడల శవమే ! అందువలనే శంకరులు ఈ పుస్త్కమునకు అనంత ఆనంద అలలు అని పేరు పెట్టారు . ఈ శ్లోకాలను పూజించిన , పాటల వలె పాడిన , సాధన చేసిన కూడ  ఏవిధముగానైన సాధకునికి ఆనంద అలలు లభించును .
     
     ప్రాచీన కుండలిని విద్యకు ఆధునిక నరముల శాస్త్రముతో కాయకల్ప చికిత్స చేసి - ఈ విద్య కల్పాంతము వరకు బ్రతికి యుండ వలెనని నా  ఆశ , ప్రయత్నము . ఇందులో ఎక్కువగా మంత్రములు , యంత్రములు కలవు . మంత్రము అర్ధముతెలుసుకొని సాధన చేయవలయును . "మాకు సత్ బుద్ది నిచ్చి , సత్కర్మలు ఆచరించునట్లు అనుగ్రహింపుము"  అనునది గాయత్రి మంత్రమునకు అర్ధము . ఎక్కువ సార్లు మనస్సులో ఉచ్చరించుట వలన , సంబందిత నరములు బలపడి , POSITIVE THINKING , LONG MEMORY , MORALITIES కు అవసరమైన PROTEINS  ను SYNAPTIC GAP నందు పుట్టి , సాధకుని పరిపూర్ణ మానవుడుగా తయారు చేయును .  
     
     స్వర్గీయ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు గాయత్రిని మంత్రముగా సాధన చేసారు , స్వర్గీయ పండిత గోపదేవ్ శాస్త్రి గారు గాయత్రిని యజ్ఞ ప్రక్రియగా సాధన చేసారు . బెనారస్ విశ్వవిద్యాలయ స్థాపకులు స్వర్గీయ మదన మోహనమాలవ్య గారు గాయత్రిని - 64 బీజములుగా విడగొట్టి , శరీరములోని  64  శక్తి స్థానములను ఉద్దీపింప చేయుట ద్వారా కుండలిని మేల్కోలిపెడివారు . ఈ రోజుకి హిందువులు పూర్ణ జ్ఞానులే ! సాధన చేయక పోవుటయే భయంకర లోపము .వినియోగించుకొనని జ్ఞానము , వినాశనమునకు దారి తీస్తుంది . మీ భవిష్యత్ మీ చేతుల్లోనే యున్నది ! పంచ బక్ష్యపరమాన్నములను ఎదురుగా యుంచుకుని , వాటిని తినలేని పరిస్థితులలో , ఆకలితో అలమటిస్తున్నాము ! జ్ఞాన వినియోగమే మనని కాపాడగలదు . ప్రస్థుతము ప్రజలు గీత ఎవరు ? గాయత్రి ఎవరు ? సౌందర్యలహరి ఎవరు ? అని ప్రశ్నించుచున్నారు !!!                   

No comments:

Post a Comment