Pages

Monday, 3 March 2014

SRINU - KRIYA - KONARK(2202) - 7

     మన శరీరము నందలి పంచభూతముల యందలి అగ్నులే పంచాగ్నులు . యోగ పరముగా ఈ పంచాగ్నులు  LIVER & PANCREAS యందు ఎక్కువగా పనిచేయును . LIVER  లో ఇప్పటి వరకు గుర్తించి ; గుర్తించనటు వంటి  600 CHEMICALS  తయారు చేయబడును . శరీరమందలి కొలాస్ట్రల్ కు ముఖ్యకేంద్రము  LIVER  యోగ పరముగా శరీరమునందలి ప్రాణము  (BIOPLASMIC ENERGY) SOLAR FLEX  వద్దే పెంపొందును . కావున మన కడుపు , ఒక యజ్ఞ పాత్ర ; అందులో వేసే ఆహుతులు (మనము తీసుకొనేడి ఆహారము) ఎంతో శుద్ది (PERFECTION) కల్గియుండవలయును ; సమతుల్యముగా (BALANCED)  యుండవలయును .
     
     యజ్ఞమునందు నెయ్యి ఎక్కువగా వాడుదురు . HARWARD UNIVERSITY  వారు కూడ వెన్నకు ప్రధమ స్థానము ఇచ్చినారు .మనము తీసుకొనేడి ఆహారమే మన శరీరము .  ఈ సృష్ఠి అంతయు ; MINERAL ; VEGETABLE ; ANIMAL & HUMAN KINGDOMS  కలపోతే . ఇవి ఒక దానిపై ఒకటి ఆధారపడి యున్నవి . సంస్కృతి ; పరిసరములను బట్టి ఆహారము స్వీకరించవలయును . ఏ వాతావరణములో యుండు వారు ఆ వాతావరణములలో పండిన పంటనే ఆహారముగా స్వీకరించవలయును .
    
      ఏ ఆహారాన్ని పూర్తిగా మానివేయవద్దు ; మానిన యెడల ఎలర్జీలకు దారితీయును . మహర్షులు కూడ EVERY THING A LITTLE  అని తెలిపినారు . యోగ పరముగా అగ్నిసార క్రియలు ; అగ్ని తుంటి వంటి అనేడి  ఆయుర్వేదమందు శరీరమందలి పంచాగ్నులను (KONARK) ఉద్దీపింప చేయును .
     
     శ్రీ కృష్ణుడు గోపబాలుడు అగుట వలన వారికి ఎల్లప్పుడు పాలు వెన్న అమితముగా యుండెడివి . వారి కుమారుడైన సాంబుడికి కూడ ఇవి అన్నియు అందుబాటులో యుండును . అందువలన సాంబుడు పాలు వెన్న మొదలగు మంచి ఆహారములను స్వీకరించి ; తనలోని పంచాగ్నులను (KONARK) ఉద్దీపింపచేసి ; తన ఆరోగ్యమును మెరుగుపరచుకొన్నట్లు భావించవచ్చును . ఇప్పటికి పూరిజగన్నాధ్ ఆలయమందలి ప్రసాదములన్నియు స్వచ్చమైన ఆవు నేతితోనే తయారు చేయుచున్నారు . ప్రస్తుతము కోణార్క్ నందు మండపము పునాదులతో యున్నది , గర్భ గుడి ముందు హాలు పూర్తిగా యున్నది ; పడిపోకుండ యుండుటకు  ఈ హాలును పూర్తిగా ఇసుకతో నింపి మూసివేసినారు . గర్భ గుది పునాదులు (BADA)  గోడలు కొంతవరకు యున్నవి . జగన్నాధ్ ; లింగరాజు ; సాక్షిగోపాల్ ;కోణార్క్  గుడులు ఒకే సంస్కృతి పై నిర్మింపబడినవి . KONARK  పూర్తిగా శిధిలావస్థతో యుండుట వలన ; ఉన్న ఆధారాలను ; మిగిలిన గుడిలతో పోల్చి చరిత్ర తయారు చేసుకోవలయును . 
     
     ఇందులోని  ముఖ్యమైన విగ్రహములను డిల్లీ ; కలకత్తా ; మరియు కోణార్క్ మ్యూజియముల నందు ప్రభుత్వము బద్రపరిచినది . గుడులు మూడు భాగములుగా ; BADA(VERTICAL WALL) ; GANDI (BODY TRUNK) ; MASTAKA (HEAD) నిర్మించినారు . యోగపరముగా బ్రహ్మగ్రంధి ; విష్ణు గ్రంధి ; రుద్ర గ్రంధి . ఒరిస్సా సంస్కృతి యందు ఈ నిర్మాణమును  PIDHA అని అందురు . GANDI  భాగము బోర్లించిన యజ్ఞ పాత్ర వలే యుండును (సుమేరు) (పిరమిడ్) . శ్రీ అనగా MASTAKA  లోని క్రింద భాగము గంట వలే (GHANTA)  యుండును . కలశము ప్రాణ సంకేతము ; గంట నాద సంకేతము ; GANDI అగ్ని సంకేతము . గుడి నిర్మాణములోని మూడు భాగములు ; మనజీవితములోని మూడు దశల యొక్క సంకేతములు . BADA  బాల్య యవ్వనములు ; GANDI  మధ్యవయస్సు ; NASTAKA వృద్దావస్థ . ఈ విధముగా సాంబుడు గుడిని తన శరీరము స్థితులను పోల్చి కట్టినారు .
     
     గర్భగుడి ; ముందు హాలు ; ఈ రెండు కలిపి ఒక రధమును పోలి యుండును . ఈ రధమునకు ఏడు చక్రములు యున్నవి. ఏడు చక్రములు సూర్య కిరణమునందలి ఏడు కిరణములు(VIBGYOR ; సప్తాశ్య) శరీరమునందలి ఏడు చక్రములు . ప్రతి చక్రము నందు  16 SPOKES యున్నవి . 16  దళములు విశుద్ది చక్ర సంకేతము . విశుద్ది సంగీతము , లలిత కళల చిహ్నము . అందువలన ఈ చక్రములయందు నాటకము చేయుచున్న  ; పాడుచున్న శిల్పములను లయబద్దముగా చెక్కినారు .
     
     గుడి  PLAT FORM  మీద అంతయు ; పద్మములు ; పద్మదళములు చెక్కినారు . పద్మము కుండలినికి చిహ్నము . హఠయోగపరముగా  పద్మము ; పద్మాసన చిహ్నము . పద్మాసనము వేయు సాధకునకు BRAIN లో  THEATA అలలు పెరుగును . అందువలన గుడి యందు ; పద్మములు ; పద్మముల దండలు ; పద్మదళములు ఎక్కువగా చెక్కినారు . పద్మము కుండలిని విద్య యందలి చక్ర సంకేతములు . రధము ముందు నుంచి మెట్లు మొదట రెండు వైపుల రెండు పెద్ద శిల్పములుండును . వంగిపీయిన మనిషి పై అడివి ఏనుగు ; అడివి ఏనుగు పై సింహము యున్నవి . మన శరీరము నందలి చక్రములు యందు యుండెడి జంతువులు ; మనలోని జంతు లక్షణముల యొక్క సంకేతములు . మానవుని పై అడవి ఏనుగు అంటే ; అతని మూర్ఖత్వమే అతనిని అణచివేయును . సింహము ఏనుగు యొక్క మెదడు తిని ఏనుగును చంపును . సింహము బుద్దికి చిహ్నము . బుద్ది మనలోని అజ్ఞానమును ప్రాలద్రోలి జీవితమును సుఖమయము చేయును .
     
     సాంబుడుని కుష్ఠు రోగము అనేడి మూర్ఖ ఏనుగు భాదపెట్టు చున్నది . తన తండ్రి ద్వారా తెలుసు కున్న సింహాసనము అనేడి ఆసన సాధన ద్వారా ; తన గొంతు ; మరియు ; నాలుక యందు యున్న కుష్ఠు క్రిములను నాశనము చేసినారు .
    
      అస్త్ర శస్త్రములు అన్ని కల్గిన బలమైన గుఱ్ఱము ఒక మానవుడును తన గిట్టలచే తొక్కుచున్న పెద్ద శిల్పములు కలవు . యోగవిద్య యందున్నఅశ్వనిముద్రలు అనేడి క్రియ ;  PERNIUM  నుంచి మెదడు వరకు యున్న అన్ని నాడులు , ముక్కుకు రక్తప్రసరణ పెంచి ; అక్కడ రోగనిరోధక శక్తి పెంచును . సాంబుడు అశ్వనిముద్రలు ద్వారా తన శరీరములోని నరముల వ్యవస్థను , ముక్కును ఆరోగ్య పరచుకుని ; కుష్ఠువ్యాధిని  ఒక యుద్ధ భూమి యందలి వీరుడువలే పోరాడి వధించెను

     అడవి ఏనుగు మూలాధార చిహ్నము ; మకరములు స్వాదిష్టాన చిహ్నములు ; యజ్ఞము ; సూర్యశిల్పములు  ; మణిపూరచక్ర  చిహ్నములు ; పద్మములు  అనాహత  చిహ్నములు ; రధచక్రములు ; 16 ముఖములు  కల్గిన  అరుణ  స్దంభము  విశుద్ది  చిహ్నములు ; శివుని  విగ్రహము  ఆజ్ఞచక్ర  చిహ్నములు .  

1 comment: